: కమలహాసన్ అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారు: మండిపడ్డ తమిళనాడు మంత్రి
ప్రముఖ నటుడు కమలహాసన్ ఈ మధ్య పలు విషయాలపై స్పందిస్తూ విమర్శలు, ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. తమిళనాడు ప్రభుత్వంపై కూడా ఆయన విరుచుకుపడుతుండడంతో ఆ రాష్ట్ర మంత్రులు కమల్‌పై ఎదురుదాడికి దిగుతున్నారు. కమల్ అసలు సినిమా ట్యాక్స్ కడుతున్నారా? అంటూ మొన్న తమిళనాడు మంత్రి ఎస్పీ వేలుమణి విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా తమిళనాడు ఆర్థిక శాఖ మంత్రి డి.జయకుమార్ మాట్లాడుతూ... అసలు కమల్‌కి రాజకీయాల్లోకి వచ్చే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. ధైర్యం ఉంటే ఆయన రాజకీయాల్లోకి రావాలని, అప్పుడు రాజకీయ వ్యవస్థ గురించి మాట్లాడొచ్చని అన్నారు. ఆయన వెనుక డీఎంకే ఉందని మంత్రి ఆరోపణలు చేశారు.