: మొదటి భారతీయ అంతరిక్ష నేపథ్య చిత్రం `టిక్ టిక్ టిక్` పోస్టర్ విడుదల
వినూత్న కథాంశాలతో సినిమాలు తెరకెక్కించే దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ మరోసారి సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జయం రవి హీరోగా `టిక్ టిక్ టిక్` టైటిల్‌తో అంతరిక్ష ప్రయాణం నేపథ్యంలో ఆయన తీసిన సినిమా పోస్టర్ విడుదలైంది. భారతదేశంలో అంతరిక్ష నేపథ్యంలో తీసిన మొదటి సినిమా ఇది. చక్కని కథాంశంతో హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది.
ఇంతకుముందు కూడా దేశంలో మొదటిసారిగా జాంబీల (మరణం లేని కల్పిత పాత్రలు) కథాంశంతో సౌందర్ రాజన్ తీసిన `మిరుథన్` సినిమా చక్కని వసూళ్లు రాబట్టింది. `అంతరిక్ష కథాంశాలను భారతీయ ప్రేక్షకులకు నచ్చేలా తీయడం కొంచెం కష్టమే. కథ సరిగా అర్థం కావడం కోసం ఈ సినిమాలో రొమాన్స్, పాటలు వంటి మూసధోరణి అంశాలు పెట్టలేదు. అయినా కూడా ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది` అని శక్తి సౌందర్ రాజన్ తెలిపారు. ఇందులో జయం రవితో పాటు ఆరన్ అజీజ్, నివేథా పేతురాజ్, రమేశ్ తిలక్‌లు నటిస్తున్నారు.