: జీవితాన్ని రిస్క్ లో పెట్టుకున్న పూర్ణిమ... ఎన్ని స్టూడియోల చుట్టూ తిరిగినా కానరాని స్పందన!


ఎలాగైనా సినిమాల్లో నటించి సత్తా చాటాలని 40 రోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయిన బాలిక పూర్ణిమా సాయి ఆచూకీ ముంబైలో తెలిసిందన్న సంగతి విదితమే. ఇక 25 రోజుల క్రితం ముంబై చేరుకున్న పూర్ణిమ, సినిమాల్లో అవకాశాల కోసం ముంబైలోని ఫిల్మ్ స్టూడియోల చుట్టూ కాళ్లరిగేలా తిరిగింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా చెప్పింది. తాను ఊహించిన దాని కన్నా భిన్నంగా పరిస్థితులు ఉన్నాయని తెలుసుకున్న తరువాతనే పోలీసులను ఆశ్రయించానని, అయితే, ఎలాగైనా సినిమాల్లో నటించాలన్న బలమైన కోరికతోనే పోలీసులకు అబద్ధాలు చెప్పానని వెల్లడించింది.

సినిమా స్టూడియోల ముందు తనను ఎవరూ పట్టించుకోలేదని తెలిపింది. ఇక మనసులోని కోరికను తీర్చుకునే దిశగా అడుగులు వేసిన పూర్ణిమ తన జీవితాన్ని రిస్క్ లో పెట్టుకున్నంత ప్రయత్నం చేసిందని, అదృష్టం కొద్దీ మాత్రమే ఆమెను దుండగులు, అక్రమ రవాణా ముఠాలు గుర్తించలేదని మానసిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

  • Loading...

More Telugu News