: బాలీవుడ్ నటి నడుం పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించిన దుండగుడు!


పీకల దాకా మద్యం తాగిన ఓ మందుబాబు ఓ సినీ నటికి చుక్కలు చూపించాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. వివరాల్లోకి వెళ్తే, ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. బాలీవుడ్, మరాఠీ సినిమాల్లో నటించిన ఓ చిన్న స్థాయి నటి తన కుమార్తెతో కలసి ముంబైలోని మీరా రోడ్డులో ఉన్న థియేటర్లో సినిమా చూడ్డానికి వెళ్లింది. సునీల్ జానీ అనే వ్యాపారి పీకల దాకా తాగి, తన మిత్రులతో కలసి అదే థియేటర్ కు వచ్చాడు. సదరు నటిని చూడగానే విచక్షణ కోల్పోయి, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె నడుమును పట్టుకుని దారుణంగా వ్యవహరించాడు. దీంతో, తొలుత షాక్ కు గురైన ఆమె, ఆ తర్వాత తేరుకుని, సెక్యూరిటీ గార్డులతో కలసి సునీల్ జానీని పోలీసులకు పట్టించింది. అతనిపై ఐపీసీ సెక్షన్లు 354, 509 కింద కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News