bellamkonda srinivvas: తెలుగు, హిందీ భాషల్లో 'డిక్టేటర్' దర్శకుని సినిమా!

లక్ష్యం .. లౌక్యం .. డిక్టేటర్ వంటి భారీ సినిమాలతో శ్రీవాస్ దర్శకుడిగా తన సత్తా చాటుకున్నాడు. 'డిక్టేటర్' సినిమాను హిందీలోకి రీమేక్ చేయడానికి శ్రీవాస్ ట్రై చేశాడు గానీ కుదరలేదు. దాంతో ఇప్పుడు తాను తెరకెక్కించనున్న సినిమాను .. హిందీలోనూ తీయాలనే గట్టిపట్టుదలతో ఆయన వున్నాడు.

 బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో శ్రీవాస్ ఒక సినిమా చేయనున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా, త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ కథ బాలీవుడ్ జనాలకు నచ్చేది కావడంతో, టైగర్ ష్రాఫ్ తో తెరకెక్కించాలనే ఉద్దేశంతో శ్రీవాస్ వున్నాడని అంటున్నారు. త్వరలోనే టైగర్ ష్రాఫ్ ను కలిసి కథ వినిపించనున్నాడని చెబుతున్నారు. అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే .. రెండు భాషల్లో ఒకేసారి చిత్రీకరణ జరుపుతాడని అంటున్నారు.   
bellamkonda srinivvas

More Telugu News