charan: చరణ్ తో మూవీ తప్పకుండా ఉంటుందన్న మణిరత్నం!

షార్ట్స్‌లో చూడండి
ప్రస్తుతం చరణ్ .. సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం 1985' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన మణిరత్నంతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే రీసెంట్ గా చరణ్ తదుపరి సినిమా కొరటాల శివతో వుండనుందనే వార్త వచ్చింది. దాంతో మణిరత్నంతో చరణ్ సినిమా ఉండకపోవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. దాదాపు ఈ సినిమా ఆగిపోయిందనే చెప్పుకుంటున్నారు.

 ఈ నేపథ్యంలో మణిరత్నం స్పందిస్తూ .. ఇప్పట్లో చరణ్ తో సినిమా చేయలేకపోవచ్చుగానీ, భవిష్యత్తులో తమ కాంబినేషన్లో ఓ సినిమా తప్పకుండా ఉంటుందని చెప్పారు. అయితే అది ఎప్పుడు మొదలవుతుందనేది మాత్రం ఇప్పుడు చెప్పలేనని అన్నారు. దీనిని బట్టి మణిరత్నం మూవీలో చరణ్ ను చూడాలనుకునేవారు, మరికొంత కాలం వెయిట్ చేయవలసిందేననే విషయం అర్థమవుతోంది.     
Go Back to Shorts
charan

More Telugu News