: దీప్తితో పెళ్లి సీన్ చేస్తే... అదే నా వివాహమని ప్రచారం చేశారు!: జబర్దస్త్ 'హైపర్ ఆది'
బుల్లితెర నటి దీప్తితో తన వివాహం రహస్యంగా జరిగిపోయిందని జరుగుతున్న ప్రచారాన్ని కామెడీ షో 'జబర్దస్త్' నటుడు ఆది ఖండించారు. తనకింకా వివాహం కాలేదని, ఇప్పటివరకూ ప్రేమించాలని కూడా అనుకోలేదని, పెళ్లి జరిగితే, అందరికీ చెప్పే చేసుకుంటానని అంటున్నాడు. 'ఆట కదరా శివ' అనే చిత్రం షూటింగులో భాగంగా, దీప్తితో తన పెళ్లి సీన్ చిత్రీకరించారని, ఎవరో దాన్ని లీక్ చేసి సోషల్ మీడియాలో ఉంచారని అన్నాడు. తానిప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్నానని, మరో రెండేళ్ల తరువాత పెద్దలు కుదిర్చే పెళ్లినే చేసుకుంటానని చెబుతున్నాడు.