: అందుకే, నాకు కలిసొచ్చిందని చెబుతుంటాను: సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు
తన నక్షత్రం శతభిషం అని, తాను ఆడిన మొదటి నాటకం పేరు శతభిషం అని, అందుకే, నటనా రంగంలో తనకు కలిసొచ్చిందని చెబుతుంటానని ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, నాటకాల నుంచి తాను సినిమాల్లోకి వచ్చానని, మొదట్లో, నాటకాలు ఆడొద్దంటూ తన తండ్రి కోప్పడేవారని చెప్పారు. తాను నటించిన సినిమాలు, ఆ చిత్ర విశేషాల గురించి ఆయన ప్రస్తావించారు. ఏ ఆర్టిస్ట్ తోనూ తనకు గొడవలు లేవని, అందరితోనూ సరదాగా ఉంటానని చెప్పారు.