: తమిళ హీరో అజిత్ కు కూడా విగ్రహం పెట్టేస్తున్నారు!
ప్రముఖ తమిళ సినీ కథానాయకుడు అజిత్ కు ఉన్న ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న అజిత్ కు ఆయన అభిమానులు ఓ విగ్రహం కట్టిస్తున్నారట. ప్రస్తుతం అజిత్ హీరోగా నటిస్తున్న ‘వివేగం’ సినిమా విడుదల నాటికి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించే ప్రయత్నాల్లో అభిమానులు ఉన్నారు. కాగా, ‘వివేగం’ చిత్రం టీజర్ ఇటీవలే విడుదలైంది. ఈ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డు స్థాయిలో వ్యూస్ సంపాదించింది. ఇదిలా ఉండగా, హీరోలు విజయ్ కాంత్, విజయ్ లకు వారి అభిమానులు గతంలో విగ్రహాలు ఏర్పాటు చేశారు.