: షాహిద్ కపూర్, ఆలియా భట్, తాప్సీ... ఐఫా అవార్డు విజేతలు వీరే!


న్యూయార్క్ లో జరుగుతున్న 18వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) అవార్డుల కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, మీరా రాజ్ పుత్, సోనాక్షీ సిన్హా, కరణ్ జోహార్, సైఫ్ అలీ ఖాన్ వంటి ఎందరో ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై అవార్డు విజేతలను అభినందించారు.
అవార్డులను గెలుచుకున్న వారి వివరాలు:
ఉత్తమ నటుడు : షాహిద్ కపూర్ (ఉడ్తా పంజాబ్)
ఉత్తమ నటి : ఆలియా భట్ (ఉడ్తా పంజాబ్)
ఉత్తమ దర్శకుడు : అనిరుధ్ రాయ్ చౌదరి (పింక్)
ఉత్తమ సహాయ నటి : షబానా అజ్మీ (నీర్జా)
ఉత్తమ సహాయ నటుడు : అనుపమ్ ఖేర్ (ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ)
ఉత్తమ తొలి చిత్ర నటి : దిశా పటానీ (ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ)
ఉత్తమ తొలి చిత్ర నటుడు : దల్జిత్ దోసాంజ్ (ఉడ్తా పంజాబ్)

ఉత్తమ పాటల రచయిత : అమితాబ్ భట్టాచార్య (చన్నా మేరీ యా - ఏ దిల్ హై ముష్కిల్)
ఉత్తమ గాయకుడు : అమిత్ మిశ్రా (ఏ దిల్ హై ముష్కిల్)
ఉత్తమ గాయని : కనికా కపూర్ (ఉడ్తా పంజాబ్), తులసీ కుమార్ (ఎయిర్ లిఫ్ట్)
ఉత్తమ సంగీత దర్శకుడు : ప్రీతమ్ (ఏ దిల్ హై ముష్కిల్)
ఉత్తమ కామెడీ నటుడు : వరుణ్ ధావన్ (డిష్యూం)
మంత్రా స్టయిల్ ఐకాన్ అవార్డు : ఆలియా భట్
ఐఫా ఉమన్ ఆఫ్ ది ఇయర్ : తాప్సీ 

  • Loading...

More Telugu News