: రజనీకాంత్ సొంత పార్టీ ఖాయమే: తమిళ రాజకీయం మారుతుందన్న గురుమూర్తి
తమిళనాడులో జయలలిత మరణం తరువాత ఏర్పడిన రాజకీయ శూన్యం త్వరలోనే భర్తీ కానుందని, రజనీకాంత్ రాజకీయాల్లోకి రానున్నారని, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త, రజనీ సన్నిహిత మిత్రుడు స్వామినాథన్ గురుమూర్తి వ్యాఖ్యానించారు. తన అంచనా ప్రకారం రజనీ సొంత రాజకీయ పార్టీని పెట్టనున్నట్టు తెలిపారు. రజనీకి తనలో ఉన్న లోపాలేమిటన్నది తెలుసనే భావిస్తున్నానని చెప్పారు.
తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని రజనీ సమూలంగా మార్చి వేయనున్నారని చెప్పారు. ఇక రజనీకాంత్, నరేంద్ర మోదీతో చేతులు కలిపితే, అది అద్భుతమే అవుతుందని అభిప్రాయపడ్డారు. ద్రవిడ రాజకీయాలు రాజ్యమేలిన తమిళనాడును ద్రవిడ రహితంగా మార్చేందుకు రజనీ రాజకీయ ప్రవేశం సహకరిస్తుందని చెప్పారు.