: డ్రగ్స్ వ్యవహారం గురించి తెలిసి చాలా బాధపడ్డా: జగపతి బాబు
పలువురు టాలీవుడ్ ప్రముఖులకి డ్రగ్స్ వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ అధికారులు నోటీసులు పంపడం, వారి పేర్లు బయటకు రావడంతో ఈ విషయంపై అలజడి చెలరేగుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్‌లో డ్రగ్స్ వినియోగంపై నటుడు జగపతి బాబు స్పందించారు. డ్రగ్స్ తీవ్రవాదం కంటే ప్రమాదకరమని చెప్పారు. ఈ కేసులో హస్తం ఉన్న వారు ఎంతటివారైనా వారికి కఠిన శిక్ష విధించాలని అన్నారు. కొన్ని రోజుల క్రితం పాఠశాలల్లో డ్రగ్స్ వినియోగం గురించి వచ్చిన వార్తలను చూసి తాను చాలా బాధపడ్డానని చెప్పారు. పిల్లలకు డ్రగ్స్ అందించడం ఘోరమైన తప్పని అన్నారు. సినీ పరిశ్రమలో డ్రగ్స్ వినియోగం గురించి తనకు తెలియదని చెప్పారు.