: మళ్లీ వార్తల్లోకి ట్రంప్ కరచాలనం... ప్రపంచంలోనే ఎక్కువసేపు కరచాలనం చేసిన అధ్యక్షుడు
హ్యాండ్‌షేక్ ద్వారా ఇన్ని సార్లు వార్తల్లోకి ఎక్కిన ఘనత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కే దక్కుతుందేమో! ఒకసారి తాను ఇవ్వకుండా, ఇంకోసారి తనకు ఇవ్వకుండా... ఇలా కరచాలనం విషయంలో ట్రంప్ చాలా సార్లు కెమెరాలకు చిక్కారు. ఈసారి మాత్రం ప్రపంచంలోనే ఎక్కువ సేపు కరచాలనం చేసిన దేశాధ్యక్షుడిగా ట్రంప్ రికార్డు సృష్టించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్‌కి ట్రంప్ వీడ్కోలు చెప్తూ ఇచ్చిన కరచాలనం వీడియో చూసిన వాళ్లందరూ ఇదే మాట అంటున్నారు.
ఇక దీనిపై నెటిజన్ల సృజనాత్మకతకు అడ్డే లేదు. `ఫెవికాల్ గానీ అంటుకుందా, ట్రంప్?` అంటూ ఒకరు, `లేదు.. వాళ్లిద్దరి మధ్య సంబంధం అంత గట్టిది మరి!` అంటూ మరొకరు ఇలా కామెంట్లు చేసుకుంటూనే వెళ్లారు. అలాగే ఫ్రెంచ్ అధ్యక్షుని భార్య బ్రిగెటే మాక్రోన్‌కి ఇచ్చిన షేక్‌హ్యాండ్‌ను కూడా నెటిజన్లు నానా రకాలుగా వర్ణించారు. మీరు కూడా చూడండి మరి!