: బైన‌రీ కోడ్ లో రిటైర్మెంట్ లెట‌ర్‌... అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ చాతుర్యం!


20 ఏళ్ల పాటు ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్‌లో ప‌నిచేసి, ఇటీవ‌లే రిటైరైన వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ జార్జ్ త‌న‌దైన శైలిలో రిటైర్మెంట్ లెట‌ర్ ను బైనరీ కోడ్ లో రాశారు. `20 ఏళ్ల త‌ర్వాత అమెజాన్ నుంచి ప‌ద‌వీ విర‌మ‌ణ పొందా. అక్క‌డ ప‌నిచేసిన ప్ర‌తిక్ష‌ణం బాగుంది. అలాగ‌ని పూర్తిగా వెళ్ల‌పోవ‌ట్లేదు, తీరు మారుతుందంతే!` అనే స‌మాచారాన్ని సున్నాలు, ఒకట్లను ఉపయోగిస్తూ బైనరీ కోడ్ లో రాశారు. ఈ లెట‌ర్‌ను త‌న అధికారిక లింక్డిన్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేశారు. అంత‌ర్జాతీయ మార్కెట్లో అమెజాన్ వారి స్మార్ట్ స్పీక‌ర్‌ను మార్కెటింగ్ చేయ‌డంలో మైఖేల్ జార్జ్ ఎంతో కృషి చేశారు.

  • Loading...

More Telugu News