: అమరావతిలో తొలి యూనివర్శిటీ ప్రారంభం.. హాజరైన చంద్రబాబు, వెంకయ్య
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. ప్రతిష్టాత్మకమైన ఎస్ఆర్ఎం యూనివర్శిటీ నేడు అమరావతిలో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులు యూనివర్శిటీని నేడు ప్రారంభించారు. మొత్తం ఏడు ఎకరాల్లో 3 లక్షల చదరపు అడుగుల్లో యూనివర్శిటీ క్యాంపస్ ను నిర్మిస్తున్నారు. ఆగస్టు 7వ తేదీ నుంచి క్లాసులు ప్రారంభమవుతున్నాయి. తొలి విడత 200 మంది విద్యార్థులతో యూనివర్శిటీ కార్యకలాపాలు మొదలవనున్నాయి. ఫిబ్రవరిలో యూనివర్శిటీకి శంకుస్థాపన చేశారు. రికార్డు సమయంలో నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోంది.