: పేర్లు బయటకు రాని 15 మంది సినీ ప్రముఖుల గురించిన క్లూస్ ఇవిగో.. !
డ్రగ్స్ వ్యవహారంలో లింక్ ఉన్న సినీ ప్రముఖుల సంఖ్య 27 అయితే... ఇప్పటి వరకు 12 మందికి నోటీసులు జారీ అయ్యాయి. మిగిలిన 15 మంది ప్రముఖుల పేర్లు బయటకు రాలేదు. ఈ 15 మందికి సంబంధించి ఎక్సైజ్ వర్గాలు కొన్ని క్లూలు ఇస్తున్నాయి. ఆ క్లూలు ఇవే.
- ప్రముఖ నిర్మాత ఇద్దరు కుమారులు. టాలీవుడ్ లో వీరి కుటుంబం అత్యంత కీలకమైనది. ఈ కుటుంబంలోని అందరూ సినీ పరిశ్రమలో ఉన్నారు. గతంలోని డ్రగ్స్ కేసుల్లో కూడా ఈయన కుమారుల పేర్లు వినిపించాయి.
- ఈయన ఓ రియలెస్టేట్ వ్యాపారి. క్రేజీ స్టార్ తో అనుకోకుండా హిట్ సినిమా నిర్మించాడు.
- మరొకరు చిన్న కథలు, కుటుంబ కథనాలతో భారీ హిట్లు కొట్టిన నిర్మాత. కుర్ర హీరోతో, సొంత బ్యానర్ తో పరిశ్రమలోకి దూసుకొచ్చాడు.
- 2009లో టాలీవుడ్ లో అడుగుపెట్టి కుర్ర హీరోలతో వరుస హిట్లు కొట్టింది. ప్రస్తుతం బాలీవుడ్ కు చెక్కేసింది.
- 2011, 2012లో ప్రముఖ హీరోలతో నటించి, హిట్లు కొట్టి... ఆ తర్వాత ఫ్లాప్ హీరోయిన్లుగా ముద్ర పడిన ఇద్దరు భామలు.
- రవితేజ తమ్ముడితో పదే పదే పార్టీలకు, పబ్ లకు వెళ్లిన ఓ సహాయ నటుడు.
- ప్రముఖ హీరోకు మేనేజర్ గా పని చేసే నటుడు.
- ఓ విలక్షణ దర్శకుడు. మేకప్ మెన్, డ్రైవర్ల పేరుతో సిమ్ కార్డులు తీసుకుని డ్రగ్స్ వాడుతున్నాడు.
- వేగంగా సినిమాలు తీస్తాడనే పేరున్న దర్శకుడు. ఈయన ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు కెల్విన్ తో టచ్ లో ఉన్నారు.
- 2013 వరకు క్యారక్టర్ ఆర్టిస్టుగా అడపాదడపా సినిమాలు చేశాడు. ఆ తర్వాత ప్రముఖ హీరోతో సినిమా తీసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు.
- ఒకప్పుడు ఆయన ఫ్యామిలీ హీరో. ఆ తర్వాత ఎలాంటి క్యారక్టర్ చేయడానికైనా సిద్ధమయ్యాడు. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన మేనేజర్ ఫోన్ నంబర్ కెల్విన్ కాంటాక్ట్ లిస్టులో ఉంది.