: తెలంగాణలోని ఏపీ వారికి ఆరోగ్య శ్రీ సేవలు బంద్!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఆ రాష్ట్రం వారికి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయనున్నారు. కేన్సర్ వంటి రోగాలకు మినహా మిగతా వాటికి హైద్రాబాద్‌లో గానీ, తెలంగాణలో మరేదైనా ప్రాంతంలో గానీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారికి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో లేకుండా చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రం విడిపోయాక కూడా ఏపీ వారికి ఇక్కడ ఆరోగ్యశ్రీ సేవలు అమలు చేశారు. అందుకు సంబంధించిన చెల్లింపులను ఏపీ ప్రభుత్వం చేసేది. ప్రస్తుతం ఏపీ వారికి ప్రత్యేకంగా `ఎన్టీఆర్ వైద్య సేవ` పథకం అందుబాటులో ఉండటంతో ఆరోగ్య శ్రీ సేవలు రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది.