: నాని ద్విపాత్రాభినయంతో `కృష్ణార్జున యుద్ధం`!
వరుస విజయాలతో దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని మరో రెండు సినిమాల్లో నటించనున్నాడు. వీటికి సంబంధించిన వివరాలను ఆయన ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. వీటిలో ఒకటి `ఓ మై ఫ్రెండ్` సినిమా దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వంలో `ఎంసీఏ` సినిమా. మరొకటి `ఎక్స్ప్రెస్ రాజా`, `వెంకటాద్రి ఎక్స్ప్రెస్` సినిమాల దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో `కృష్ణార్జున యుద్ధం`. వీటికి వరుసగా దేవిశ్రీ ప్రసాద్, హిప్ హాప్ తమిళ సంగీతం సమకూర్చుతున్నారు. వీటిలో `కృష్ణార్జున యుద్ధం` సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేయనున్నాడు.