: ఓర్వలేని వారే నాపై దుష్ప్రచారం చేస్తున్నారు: హీరోయిన్ కాజల్


తన ఎదుగుదలను చూసి ఓర్వలేక... తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మండిపడింది. అయితే, వారి కుట్రలు తనను ఏమీ చేయలేవని... పరిశ్రమలో తన స్థానాన్ని ఎవరూ కదిలించలేరని ఆమె చెప్పింది. మరి కొన్నేళ్ల వరకు తాను అగ్రహీరోలతోనే నటిస్తానని తెలిపింది. ఈ మధ్య కాజల్ పై రకరకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి. తన అందాన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని... ఒక ప్రముఖ టాలీవుడ్ నటుడితో రహస్యంగా కలుస్తోందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాజల్ ఘాటుగా స్పందించింది.

  • Loading...

More Telugu News