: ఇలాగే మాట్లాడుతూ ఛాలెంజ్ చేసి.. న్యూస్ ఛానెల్ నుంచి ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లాను: నందు
టాలీవుడ్ లో కలకలం సృష్టిసోన్న డ్రగ్స్ కేసులో యువ నటుడు, గాయని గీతా మాధురి భర్త నందుకి కూడా సిట్ నోటీసులు పంపించిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ రోజు హైదరాబాద్‌లోని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడకు వెళ్లడానికిగల కారణాలను గురించి నందు వివరించి చెప్పాడు. తాను ఓ న్యూస్ చానెల్ స్టూడియోలో మాట్లాడుతున్నానని, తనపై వస్తోన్న ఆరోపణలు నిజం కావని నిరూపిస్తానని ఛాలెంజ్ చేశానని అన్నాడు.
ఆ ఛానెల్ వారు కెమెరాలు తీసుకుని తనతో పాటు ఆ కార్యాలయానికి వచ్చారని చెప్పాడు. తాను ధైర్యంగా అక్కడివరకు వెళ్లానంటే దానికి కారణం తాను తప్పు చేయలేదనే కదా? అని వ్యాఖ్యానించాడు. కావాలంటే తనకు రక్త పరీక్ష చేసుకోవచ్చని కూడా అన్నాడు. తనకు అధికారులు నోటీసులు పంపించకముందే తనకు పంపారని, ఎన్నో ఆరోపణలు వస్తున్నాయని బాధగా అన్నాడు.