: డ్రగ్స్ కేసులో మరో వ్యక్తి అరెస్టు!
డ్రగ్స్ కేసులో మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ డీసీ వివేకానందరెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ లో ఈవెంట్ ఆర్గనైజర్ గా పనిచేస్తున్న పీయూష్ అనే వ్యక్తి ఆన్ లైన్ లో ముడిసరుకును తెప్పించుకుని, తన ఇంట్లోనే మత్తు పదార్థాలను తయారు చేస్తున్నాడని చెప్పారు. పీయూష్ విదేశాల నుంచి ఎల్ ఎస్డీలు తెప్పించుకున్నట్టు తమ ప్రాథమిక నిర్ధారణలో వెల్లడైందని చెప్పారు. 400 గ్రాముల కొకైన్, 80 ఎల్ఎస్డీలు, 20 గ్రాముల గంజాయి,150 మత్తు మాత్రలు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. వయాగ్ర, యాంటీ డిప్రెషన్ మందులు, కెఫెన్, నిద్రమాత్రలు కలిపి లోకల్ మేడ్ ఎల్ఎస్సీడీ ప్యాకెట్లను తయారు చేసేవాడని చెప్పారు. విదేశాల నుంచి తెప్పించిన సరుకుకు సమానంగా మత్తు వచ్చేలా వీటిని తయారు చేసేవాడని అన్నారు.