: అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో వన్‌ప్లస్ 5 అమ్మకాలు టాప్
30 గంటలపాటు అమెజాన్ ప్రైమ్ సంవత్సర చందా వినియోగదారుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన `అమెజాన్ ప్రైమ్ డే సేల్`లో ఎక్కువగా వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్లు అమ్ముడయ్యాయని కంపెనీ తెలిపింది. వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న ఫీచర్లే దాని అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణమని అమెజాన్ ప్రతినిధి చెప్పారు. అలాగే ఈ సేల్ వల్ల రికార్డు స్థాయిలో ప్రైమ్ వీడియో సభ్యత్వం తీసుకున్నవారి సంఖ్య కూడా పెరిగిందని, భారత్‌లో తమ మొదటి ప్రైమ్ డే సేల్ విజయవంతమైనందుకు సంతోషంగా ఉందని అమెజాన్ ప్రకటించింది. ప్రైమ్ డే సేల్ సమయంలో అమ్ముడైన వస్తువుల్లో మొదటి మూడు స్థానాల్లో ఫైర్ టీవీఎస్ స్టిక్, వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్, సియగేట్ ఎక్స్‌పాన్షన్ 1.5 టీబీ పోర్టబుల్ ఎక్స్‌టర్నల్ డ్రైవ్‌లు ఉన్నాయని తెలిపింది.