: డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో ట్విట్టర్ లో ఓ ‘మంచిమాట’ను పోస్ట్ చేసిన చార్మి!
టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోన్న డ్రగ్స్ కేసులో నటి చార్మి పేరు కూడా వినిపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ కేసులో నోటీసులు అందుకున్న అందరు నటుల్లాగానే ఆమె కూడా నీతి వ్యాఖ్యలు చేసింది. అయితే, ‘విచారణకు సహకరిస్తాను.. నా మీద పడ్డ మచ్చను చెరిపేసుకుంటాను’ వంటి వ్యాఖ్యలు కాకుండా ఇంకాస్త ముందుకెళ్లింది. ఓ ఆసక్తికర ట్వీట్ చేసింది. ‘మిమ్మల్ని ఎవరైనా దిగజార్చాలని ప్రయత్నిస్తుంటే... వారి కంటే మీరు ఉన్నత స్థాయిలో ఉన్నట్టే’నని ఓ సూక్తిని పేర్కొంది. ఏకంగా ఇంతటి గొప్ప వ్యాఖ్యని పోస్టు చేసి తాను నిర్దోషినని చెప్పుకునే ప్రయత్నం చేసింది.