: కొన్ని రోజులు సెలవులు తీసుకుంటున్నా: ఎక్సైజ్ శాఖ‌ డైరెక్టర్ అకున్ సబర్వాల్


టాలీవుడ్‌లో క‌ల‌క‌లం సృష్టిస్తోన్న డ్ర‌గ్స్ కేసును ద‌ర్యాప్తు చేప‌డుతున్న ఎక్సైజ్ శాఖ‌ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ప‌దకొండు రోజులు వ్య‌క్తిగ‌త సెల‌వులు తీసుకున్న‌ట్లు చెప్పారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. డ్ర‌గ్స్ కేసుకు, త‌న సెల‌వుల‌కు సంబంధం లేద‌ని వ్యాఖ్యానించారు. ఎల్లుండి నుంచి ఈ నెల 27వ‌ర‌కు తాను సెల‌వుల‌పై వెళ్తున్న‌ట్లు చెప్పారు. త‌న వ్య‌క్తిగ‌త ప‌నుల‌పైనే ఈ సెల‌వులు తీసుకున్నాన‌ని చెప్పారు. కాగా, టాలీవుడ్‌లో డ్ర‌గ్స్ కేసుతో సంబంధ‌మున్న మ‌రికొంత మందికి త్వ‌ర‌లోనే నోటీసులు పంప‌నున్నారు. ఇప్ప‌టికే ఈ కేసులో నోటీసులు అందుకున్న వారు విచార‌ణ‌కు హాజ‌రుకావాల్సి  ఉంది.

  • Loading...

More Telugu News