: గత నెల 3,500 అశ్లీల సైట్లను బ్లాక్ చేశాం: కేంద్రం
విద్యార్థులపై దుష్ప్రభావం చూపించే అశ్లీల వెబ్‌సైట్ల ఏరివేతలో భాగంగా గత నెల 3,500 సైట్లను బ్లాక్ చేసినట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ ఇచ్చింది. అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) వారికి పాఠశాలల్లో అశ్లీల వెబ్‌సైట్లు ఓపెన్ అవకుండా జామర్లు ఏర్పాటు చేయాలని చెప్పినట్లు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనానికి వివరించింది.
`పాఠశాల వరకు జామర్లు ఏర్పాటు చేయడం కుదురుతుంది కానీ స్కూల్ బస్సుల్లో కూడా జామర్లు ఏర్పాటు చేయడం వీలు కాదు.. దీనిపై ఏదో ఒక పరిష్కారాన్ని త్వరలో రూపొందిస్తాం` అని అడిషనల్ సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ ధర్మాసనంతో చెప్పారు. అయితే అశ్లీల వెబ్‌సైట్ల ఏరివేతకు సంబంధించిన రిపోర్టును రెండ్రోజుల్లోగా ప్రవేశ పెట్టాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది.