: రైలు కోసం మోదీ నిరీక్షిస్తున్నట్టు ఫోటో... ఏఐబీ 'సరదా' పోస్ట్‌పై నెటిజన్ల ఆగ్రహం!
సమకాలీన హాస్యోక్తులతో వార్తల్లో నిలిచే కామెడీ బృందం ఏఐబీ ఇటీవల చేసిన పోస్ట్ ఒకటి వివాదస్పదమైంది. ప్రధాని నరేంద్ర మోదీలా ఉండే వ్యక్తి రైలు కోసం నిరీక్షిస్తుండగా తీసిన ఫొటోను ప్రధాని పేరుతో సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఇది భారత ప్రధానిని అవమానిస్తున్నట్లుగా ఉందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పోస్ట్‌ను ముంబై పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లడంతో ఏఐబీ వారు దీన్ని డిలీట్ చేశారు.
ఆ తర్వాత వారిని విమర్శిస్తూ నెటిజన్లు కామెంట్లు చేశారు. `మీ హాస్యం మరీ మితిమీరుతోంది!`, `జోక్‌కి, అవమానానికి తేడా తెలుసుకోండి!` అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటికి సమాధానంగా ఏఐబీ బృందంలో ఒకరైన తన్మయ్ భట్ - `మేం జోకులు చేస్తాం. అవసరమైతే డిలీట్ చేస్తాం. మరీ అవసరమైతే క్షమాపణలు కూడా చెప్తాం. మీరేం అనుకున్నా మాకు అనవసరం` అని దురుసుగా సమాధానమిచ్చాడు.