nithin: 'లై' దర్శకుడికి అర్జున్ క్లాస్ పీకాడట!

తీసిన రెండు సినిమాలు విభిన్నమైన చిత్రాలుగా తీసి.. విజయాలను సొంతం చేసుకున్న హను రాఘవపూడి తాజాగా 'లై' చిత్రాన్ని చేస్తున్నాడు. నితిన్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. ఆయన హను రాఘవపూడిపై ఫైర్ అయినట్టుగా ఒక వార్త ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

 సీన్ పేపర్ తీసుకుని డైలాగ్స్ ప్రిపేర్ అయిన తరువాత, దర్శకుడు హను మళ్లీ డైలాగ్స్ మారుస్తున్నాడట. ఇలా ఒకటికి రెండు సార్లు జరగడంతో అర్జున్ కి కోపం వచ్చేసిందట. ఆయనకి కథ .. స్క్రీన్ ప్లే .. మాటలు విషయంలో ఎంతో అనుభవమున్న సంగతి తెలిసిందే. అందుకే ఇది కరెక్ట్ కాదంటూ ఆయన హను రాఘవపూడిపై అసహనాన్ని ప్రదర్శించాడట. సెట్ నుంచి వెళ్లిపోవడానికి కూడా ప్రయత్నించడంతో, అతి కష్టం మీద ఆయనని శాంతింపజేసినట్టు చెప్పుకుంటున్నారు.  
nithin
arjun

More Telugu News