: డ్రగ్స్ నోటీసులపై గాయని గీతామాధురి భర్త నందు స్పందన!


డ్రగ్స్ కేసులో పలువురు సినీ ప్రముఖులకు సిట్ నోటీసులు జారీ చేయడం సంచలనం రేపుతోంది. హీరో రవితేజ, హీరోయిన్ ఛార్మి, దర్శకుడు పూరి జగన్నాథ్ లతో పాటు పలువురికి నోటీసులు ఇచ్చారు. వీరిలో గాయని గీతామాధురి భర్త నందు కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో, నందుని ఓ మీడియా సంస్థ ఫోన్ ద్వారా సంప్రదించింది.

ఈ సందర్భంగా నందు మాట్లాడుతూ తనకు, ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. వాస్తవాలను మాత్రమే వెలుగులోకి తీసుకు రావాల్సిన బాధ్యత మీడియాకు ఉందని అన్నాడు. తనకు ఎలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశాడు. అయితే, నందుకు నోటీసులు అందినట్టు మీడియా వద్ద స్పష్టమైన సమాచారం ఉండటం గమనార్హం. 

  • Loading...

More Telugu News