: మొత్తం 40 మంది సినీ ప్రముఖుల పేర్లు సిట్ ముందు... ప్రస్తుతానికి నోటీసులు 12 మందికి!


డ్రగ్స్ దందాలో మొత్తం 40 మంది టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖుల పేర్లు ఉన్నట్టు పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ కేసులో తొలుత అరెస్ట్ అయిన కెల్విన్ సహా పలువురి కాల్ డేటాలో వీరందరి నంబర్లు ఉన్నాయి. వారి ఫోన్ల నుంచి సినీ ప్రముఖులకు, సినీ ప్రముఖుల నుంచి వారికి కాల్స్ వెళ్లాయి. వాట్స్ యాప్ గ్రూపుల మాధ్యమంగా డ్రగ్స్ కావాలని ఆర్డర్లు వెళ్లాయి. వాటన్నింటినీ సేకరించిన పోలీసులు, ప్రస్తుతానికి ఎక్కువ సార్లు డ్రగ్స్ కొనుగోలు చేశారని భావించిన వారికి మాత్రమే నోటీసులు పంపారు.

ఇక, వీరి విచారణ ముగిసిన తరువాత మరో 25 నుంచి 30 మందికి నోటీసులు ఇచ్చి, వారందరినీ ప్రశ్నించాలని ఎక్సైజ్ పోలీసులు భావిస్తున్నారు. పక్కాగా సాక్ష్యాలు లేకుండా తాము ఎవరినీ పిలవదలచు కోలేదని, సాక్ష్యం ఉందని భావించిన తరువాతే నోటీసులు పంపామని అకున్ సబర్వాల్ వెల్లడించారు. ఒకసారి నోటీసు ఇచ్చిన తరువాత వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సినిమా ఇండస్ట్రీపై డ్రగ్స్ మరక పడటం, అది ఎంత లోతుకు పాకిపోయిందోనన్న ఆందోళన ఇప్పుడు సినీ పెద్దల్లో నెలకొంది. 

  • Loading...

More Telugu News