: పూరీ జగన్నాథ్, చార్మి, ముమైత్ ఖాన్, తరుణ్, సుబ్బరాజు, నవదీప్, నందు... డ్రగ్స్ మత్తులో చిక్కుకుని నోటీసులు అందుకున్న వారి పేర్లు
టాలీవుడ్ లో డ్రగ్స్ ప్రకంపనలు కొనసాగుతున్న వేళ, ఎక్సైజ్ శాఖ నుంచి విచారణను ఎదుర్కోనున్న వారి పేర్లు వెల్లడయ్యాయి. నోటీసులు అందుకున్న సినీ ప్రముఖుల్లో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, చార్మి, ముమైత్ ఖాన్, తరుణ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, నవదీప్, శ్రీనివాసరావు, తనీష్, నందు తదితరులు ఉన్నారు. వీరంతా ఈ నెల 19 నుంచి 27 వరకూ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి వుంది. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగానే హాజరు కావాలని, రాకుంటే చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు.