: ఆ నివేదిక నిండా ఆరోపణలు, ఊహాగానాలే... వాస్తవాలు కాదు... గద్దె దిగేది లేదు: నవాజ్ షరీష్
పనామా పేపర్స్ వెల్లడించిన అవినీతి సమాచారం మేరకు సంయుక్త విచారణ బృందం (జిట్) పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పై విచారణ నిర్వహించిన విషయం విదితమే. ఈ విచారణ తర్వాత ఆయనపై కేసు నమోదు చేయాలంటూ సిఫార్సు చేసినందువల్ల నవాజ్ రాజీనామా చేయాలంటూ వెల్లువెత్తుతున్న డిమాండ్లను ఆయన తోసిపుచ్చారు. ఈ మేరకు ఆయన నిన్న అత్యవసర మంత్రి మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తానేమీ తప్పు చేయలేదని, జిట్ నివేదిక కూడా తన తప్పులను నిర్ధారించలేదని, ఆరోపణలు, ఊహాగానాలకు సంబంధించిన నివేదిక మాత్రమే ఇచ్చిందని ఆయన తెలిపారు. తనను ఎన్నుకున్న ప్రజలు మాత్రమే తనను తప్పించగలరని ఆయన స్పష్టం చేశారు. జిట్ నివేదికలో ఊహాగానాలు, ఆరోపణలు మాత్రమే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.