varun tej: 'ఫిదా'లోని కొన్ని సీన్స్ కి దిల్ రాజు కోత పెడతాడా?

దిల్ రాజు మంచి అభిరుచి కలిగిన నిర్మాత అనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పవలసిన పనిలేదు. తాను నిర్మించే సినిమాల విషయంలో ఆయన చాలా క్లారిటీగా వుంటారు. దర్శకుల నుంచి తనకి కావాల్సిన అవుట్ పుట్ ను రాబట్టుకుంటారు. సన్నివేశాలు ఎంతమాత్రం బోర్ కొట్టకుండా చాలా క్రిస్పీ గా ఉండేలా చూసుకుంటారు. అనవసరమనుకున్న సన్నివేశాలను నిర్మొహమాటంగా లేపేస్తుంటారు.

 'ఫిదా' సినిమా విషయంలోను ఆయన ఇదే పని చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. కొంచెం సుదీర్ఘంగా వున్నాయనుకున్న సన్నివేశాలను కుదించడం మంచిదని శేఖర కమ్ములతో దిల్ రాజు చెప్పినట్టుగా ఒక టాక్. అలా దిల్ రాజు తగ్గించమన్న సన్నివేశాల నిడివి దాదాపు 25 నిమిషాల వరకూ ఉండవచ్చని చెప్పుకుంటున్నారు. ఆయన సూచనలు సరైనవిగా అనిపించడంతో శేఖర్ కమ్ముల కూడా ఓకే అన్నాడట.  
varun tej
sai pallavi

More Telugu News