sukumar: 'దర్శకుడు' ఆడియో ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా చరణ్!

షార్ట్స్‌లో చూడండి
యూత్ కి కనెక్ట్ అయ్యే సినిమాలను తెరకెక్కించడంలో సుకుమార్ ఎప్పుడూ ముందే ఉంటాడు. కథ .. కథనాలను సిద్ధం చేసుకోవడంలోనే కాదు .. వాటిని అద్భుతంగా తెరపై ఆవిష్కరించడంలోను ఆయన సిద్ధహస్తుడు. ఆయన మంచి దర్శకుడే కాదు .. అభిరుచి కలిగిన నిర్మాత కూడా. కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ సొంత బ్యానర్ పై ఆయన సినిమాలను నిర్మిస్తుంటాడు. అలా తాజాగా 'దర్శకుడు' అనే సినిమాను నిర్మించాడు.

 అశోక్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి హరిప్రసాద్ దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ సినిమాను వచ్చేనెల 4వ తేదీన విడుదల చేసే ఆలోచనలో సుకుమార్ వున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీన ఈ సినిమా ఆడియో వేడుకను హైదరాబాదులో జరపడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నాడు. 'గచ్చిబౌలి'లో జరగనున్న ఈ వేడుకకు చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడు. సుకుమార్ తో గల సాన్నిహిత్యం కారణంగా చరణ్ ఈ ఫంక్షన్ కి వస్తున్నాడని చెప్పుకుంటున్నారు.  
Go Back to Shorts
sukumar

More Telugu News