'పటేల్ సర్'పై తాన్య 'హోప్'!
రేపు ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 'పటేల్ సర్' లో నటించే ఛాన్స్ రావడం తన అదృష్టమని చెప్పింది. ఈ సినిమాలో తాను పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాననీ .. తొలిసారిగా ఈ పాత్రలో తనను తాను చూసుకోవడం ఆనందంగా ఉందని అంది. యాక్షన్ థ్రిల్లర్ తో కూడిన ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా కొనసాగుతుందని చెప్పింది. ఈ సినిమా తన కెరియర్ కి తప్పకుండా హెల్ప్ అవుతుందనే నమ్మకం ఉందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.