: కాల్ డేటా ఆధారంగానే సినీపరిశ్రమలో డ్రగ్స్ వాడకందారులను గుర్తించాం: ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్
హైదరాబాద్‌లో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసులో సంబంధమున్న సినిమా వారికి నోటీసులు పంపినట్లు ఎక్సైజ్ ఈడీ అకున్ సబర్వాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరిన్ని విషయాలు తెలిపిన ఆయన... పట్టుబడ్డ నిందితుల కాల్‌డేటా ఆధారంగా సినీ పరిశ్రమలో వాడకందారులను గుర్తించామని వివరించారు. సినీపరిశ్రమలో మత్తుపదార్థాల వాడకందారుల సంఖ్య కూడా అధికమైందని తెలిపారు. ఇప్పటికే నోటీసులు అందుకున్నవారు వారికి నిర్దేశించిన తేదీల్లో విచారణకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేశారు.