: చేపను నిలువుగా కోసి రెండు ముక్కలుగా చేసినప్పటికీ.. ఎలా కదులుతుందో చూడండి!
జపాన్ లో ఓ రెస్టారెంటు వారు ఎల్లో ఫిన్ టూనా అనే చేపను కోసి దానికి కారం, మసాలా దట్టించి వండాలనుకున్నారు. అందుకోసం అన్నింటినీ సిద్ధం చేసుకుని, చేపను తీసుకువచ్చి బతికుండగానే నిలువుగా కోశారు. అయితే, దాన్ని నిలువుగా కోసి, రెండు ముక్కలు చేసినప్పటికీ అది చావలేదు. పైకి, కిందికి ఎగురుతూ కొట్టుకుంది. రెండు ముక్కలైన ఆ చేపలోని ఓ భాగం ఇలా ఎగురుతున్న ఈ అరుదైన దృశ్యాన్ని వారు తమ కెమెరాల్లో బంధించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఆ చేప రెండు నిమిషాల పాటు కొట్టుకుని, చివరకు ప్రాణాలు విడిచింది. అనంతరం దాన్ని కూర వండుకుని తినేశారు. రెండు ముక్కలుగా కోసేసినప్పటికీ ఈ చేప ఇలా కదలడం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను మీరూ చూడండి...