nani: నాని పారితోషికం ఎనిమిది కోట్లు?

ఓ మాదిరి బడ్జెట్ తో సినిమాలు చేయాలనుకుంటున్న దర్శక నిర్మాతలకి నాని ఒక ఆశా కిరణంలా కనిపిస్తున్నాడు. అలా అని వరుసగా వచ్చేసిన ఆఫర్లను స్వీకరించే ఆలోచనలో నాని లేడు. కథలో కొత్తదనం .. కథనంలో ఆసక్తి వుంటేనే నాని అంగీకరిస్తూ వస్తున్నాడు. అందువల్లనే వరుస విజయాలు ఆయన కెరియర్ ను పరుగులు తీయిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన పారితోషికం పెరిగినట్టుగా ఒక వార్త ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

 'నేను లోకల్' సక్సెస్ అయినప్పుడే తన పారితోషికం ఒకటి .. రెండు కోట్లు పెంచాలని ఆయన అనుకున్నాడట. కానీ ఆ నిర్ణయాన్ని ఆచరణలో పెట్టడం కాస్తంత ఆలస్యమైంది. రీసెంట్ గా 'నిన్ను కోరి' కూడా హిట్ కావడంతో తన పారితోషికాన్ని ఆయన 5 నుంచి 8 కోట్లకు పెంచాడని అంటున్నారు. నాని సినిమాలకి గల బిజినెస్ ను బట్టి .. ఆ మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడటం లేదట. మరి ఈ ప్రచారం పై నాని ఏమంటాడో చూడాలి.   
nani

More Telugu News