: 98 కోట్లకు ఎగనామం... కళానికేతన్ ఎండీ అరెస్టు


బ్యాంకులను ముంచే ప్రయత్నం చేసిన బడాబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బ్రాంచ్ లు ఉన్న ప్రముఖ వస్త్ర దుకాణ సంస్థ కళానికేతన్ ఎండీ లీలాకుమార్ ను హైదరాబాదు, సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. 98 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను లీలా కుమార్ ఎగ్గొట్టాడని పోలీసులు తెలిపారు. కళానికేతన్ డైరెక్టర్ల ఆస్తులను బ్యాంకుల్లో తనఖా పెట్టి, బ్యాంకు రుణాలు పొందిన లీలా కుమార్ వారికి తెలియకుండా వారి ఆస్తులను విక్రయించాడు. కొత్త షాపులు తెరుస్తామంటూ కాస్మోస్ బ్యాంకు నుంచి లీలా కుమార్ రుణం పొందాడు. అనంతరం తీసుకున్న రుణం, రుణానికి వడ్డీ చెల్లించకపోవడంతో బ్యాంకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతనిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. 

  • Loading...

More Telugu News