: గుర్రంపై ఊరేగుతూ.. బావిలో పడ్డ పెళ్లికొడుకు!.. వైరల్ వీడియో మీరూ చూడండి
అప్పటి దాకా ఎంతో ఆనందంగా కొనసాగుతున్న పెళ్లి వేడుకలో అపశ్రుతి దొర్లడంతో... బంధువులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పెళ్లి కొడుకును ఊరేగింపుగా గుర్రంపై తీసుకెళుతున్న సమయంలో దురదృష్టవశాత్తు గుర్రంతో పాటు పెళ్లికొడుకు కూడా పక్కనున్న బావిలో పడిపోయాడు. దీంతో, పెళ్లికొడుకుకు ఏమవుతుందోనని అందరూ ఆందోళన చెందారు. అప్పటిదాకా వారిలో ఉన్న ఆనందం ఆవిరైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గొండాలో నిన్న చోటు చేసుకుంది.
ఘటన జరిగిన వెంటనే స్థానికులు రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న రెస్క్యూ సిబ్బంది... జేసీబీ సహాయంతో పెళ్లికొడుకును, గుర్రాన్ని బయటకు తీశారు. బావి లోతు ఎక్కువగా లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బావి నుంచి బయటకు తీసిన తర్వాత వరుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.