: కలెక్టర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అరెస్ట్.. విడుదల!


మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా కలెక్టర్ ప్రీతిమీనాతో అనుచితంగా ప్రవర్తించిన నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఆయన స్టేషన్ బెయిల్ పై విడుదల అయ్యారు. శంకర్ నాయక్ పై ఐపీసీ 353, 354 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బెయిల్ రావడంతో ఆయన మహబూబాబాద్ క్యాంప్ ఆఫీసుకు వెళ్లిపోయారు.

కేసు వివరాల్లోకి వెళ్తే, హరితహారం సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రీతిమీనాతో దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. బేషరతుగా కలెక్టర్ కు క్షమాపణలు చెప్పాలని, లేకపోతే పార్టీకి రాజీనామా చేయాలని కన్నెర్ర చేశారు. ఈ నేపథ్యంలో, కలెక్టర్ కు ఆయన క్షమాపణ చెప్పారు. పొరపాటున తన చేయి కలెక్టర్ కు తగిలి ఉండవచ్చని చెప్పారు. అయినప్పటికీ, కలెక్టర్ శాంతించకపోవడంతో... ఈ రోజు ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News