: ‘అమర్‌నాథ్’ దాడి వెనక పొరుగు దేశం.. దాడికి పాల్పడిన వారిలో ఇద్దరు పాకిస్థానీయులే!


పాక్ నైజం మరోమారు బయటపడింది. ఆ దేశం ఉగ్రవాదులకు నిలయమని తేటతెల్లమైంది. అమర్‌నాథ్ యాత్రికులపై జరిగిన దాడి వెనక పాక్ హస్తం కూడా ఉందన్న విషయం తేలింది. యాత్రికుల బస్సుపై దాడి చేసిన నలుగురు ఉగ్రవాదుల్లో ఇద్దరు పాకిస్థానీయులు ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. లష్కరే తోయిబా కమాండర్ అబు ఇస్మాయిల్ ఈ దాడికి పథక రచన చేసినట్టు హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. దాడిలో ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు, మరో ఇద్దరు పాకిస్థాన్‌కు చెందినవారు పాల్గొన్నారు. ఉగ్రవాదుల కోసం పోలీసులు వేట ప్రారంభించారు. సోమవారం రాత్రి జరిగిన దాడిలో ఏడుగురు యాత్రికులు మరణించగా, పదుల సంఖ్యలో గాయపడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News