: 'సాగరసంగమం' రీమేక్ వార్తలపై స్పందించిన కె.విశ్వనాథ్!


సుమారు ముప్పై ఏళ్ల క్రితం విడుదలైన అద్భుత చిత్రం సాగరసంగమం. కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎవర్ గ్రీన్ మూవీ అనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదనిపిస్తుంది. ఈ చిత్రంలో కమలహాసన్, జయప్రద నటనా కౌశల్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం.. ఈ చిత్రం గురించిన ప్రస్తావన ఎందుకంటే, ఈ తరం అభిరుచుల మేరకు విశ్వనాథ్ దర్శకత్వంలో ఇదే చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్ తో తెరకెక్కిస్తారనే ఊహాగానాలు కొన్నాళ్లుగా వినవస్తున్నాయి.

ఈ విషయమై విశ్వనాథ్ ను తాజాగా ప్రశ్నించగా.. ఆ ఊహాగానాలు తన చెవినా పడ్డాయని చెప్పారు. గతంలో వచ్చిన కొన్ని కొన్ని సినిమాలను మళ్లీ చేయాలా? వద్దా? అనేది ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన విషయమని అన్నారు. ఒకవేళ, గతంలో వచ్చిన ఏ సినిమానైనా మళ్లీ తీస్తే, అది  ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందనేది ప్రశ్నగానే మిగిలిపోతుందని విశ్వనాథ్ చెప్పారు.

  • Loading...

More Telugu News