: ‘బాహుబలి’లా రాజమౌళి యాక్ట్ చేస్తే కుదురుతుందా?: అంబటి రాంబాబు


రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్త అవసరమా? లేదా? అనే విషయమై ఓ న్యూస్ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘మానవ సమాజ పరిణామ క్రమాలు ఏ విధంగా మారుతున్నాయో, ఇప్పుడు స్ట్రాటజీలు కూడా అలాగే మారుతున్నాయి. పూర్వం పెళ్లి చేసుకోవాలంటే ఏం జరిగేది.. పందిరి మనమే వేసేవాళ్లం, వంటలు మనమే వండేవాళ్లం. కానీ, ఈ రోజు, పెళ్లి అంటే, ఈవెంట్ మేనేజ్ మెంట్స్ వారు చూసుకుంటున్నారు. మొత్తం అన్ని పనులు మనం చేసుకోలేనప్పుడు ఈవెంట్ మేనేజ్ మెంట్స్ చేస్తాయి.

‘బాహుబలి’లా రాజమౌళి యాక్ట్ చేస్తే కుదురుతుందా? ఆయన డైరెక్షన్ చేయడానికే పనికొస్తాడు తప్పా, గద మోయడానికి పనికిరాడు. అదేవిధంగా, ఇవాళ, కొన్నికొన్ని సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలానే, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆయన కార్యక్రమం ఆయన చేస్తాడు, రాజకీయనాయకుల కార్యక్రమాలు రాజకీయనాయకులు చేస్తారు. అదే ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుస్తాడా? ఒక్క ఓటు కూడా పడదు’ అంటూ విశ్లేషించారు.

  • Loading...

More Telugu News