: తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి రాజీనామా!


తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి తన రాజీనామా లేఖను పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వంపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, సీఎం కేసీఆర్ పై తనకు అపారగౌరవం ఉందని చెప్పారు. కాగా, కొన్నాళ్లుగా రామకృష్ణారెడ్డి తీరుపై ప్రభుత్వం అసంతృప్తిగా ఉంది. ఇదిలా ఉండగా, నూతన అడ్వకేట్ జనరల్ (ఏజీ)గా సీనియర్ న్యాయవాది ప్రకాశ్ రెడ్డి పేరును ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News