nayanatara: 'వాసుకి' శాటిలైట్ రేటుపై నయన్ క్రేజ్ ప్రభావం!

షార్ట్స్‌లో చూడండి
తమిళనాట కూడా కథానాయికల పోటీ గట్టిగానే ఉంటుంది. ఆల్రెడీ అక్కడ రేసులో వున్న కథానాయికలు .. ఇతర భాషలనుంచి వచ్చిన కథానాయికలు నయనతార స్థానానికి దగ్గరగా కూడా వెళ్లలేక పోతున్నారు. ఎలాంటి హడావిడి చేయకుండా నయనతార వరుసగా వైవిధ్యభరితమైన సినిమాలు చేసుకుంటూ .. సక్సెస్ లు సాధిస్తూ వెళుతోంది. మలయాళంలోను ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంది.

 అలా మలయాళంలో ఆమెకి విజయాన్ని తెచ్చిపెట్టిన 'పుదియ నియమం' సినిమాను, 'వాసుకి' పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ సినిమా ఇక్కడ ఇంకా రిలీజ్ కాక మునుపే, నయనతారకి గల క్రేజ్ కారణంగా జీ తెలుగు వారు ఫ్యాన్సీ రేటుకు శాటిలైట్ హక్కులను దక్కించుకున్నారు. సమాజంలో స్త్రీలకి జరుగుతోన్న అన్యాయాలను ధైర్యంగా ఎదిరించే మహిళగా ఈ సినిమాలో నయనతార కనిపించనుంది.        
Go Back to Shorts
nayanatara

More Telugu News