: బుర్ర ఉన్నోడు ఎవరైనా.. మేనిఫెస్టో చెప్పుకుని పాదయాత్ర చేస్తారా?: జగన్ పై అయ్యన్నపాత్రుడు వ్యంగ్యం
పాదయాత్రలు చేసినంత మాత్రాన ఎవరూ ముఖ్యమంత్రి అయిపోరని మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. బుర్ర ఉన్నవాడు ఎవడైనా మేనిఫెస్టోను చెప్పుకుని, పాదయాత్రను ప్రకటిస్తారా? అని ఎద్దేవా చేశారు. జగన్ కు ఏం అర్హత ఉందని ప్రజలు ఆయనను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారని ప్రశ్నించారు. డబ్బులిచ్చి సలహాదారులను పెట్టుకున్న జగన్ కు చంద్రబాబును విమర్శించే అర్హత ఉందా? అని అడిగారు.
జగన్, ఎమ్మెల్యే రోజాలకు రాజకీయాల పట్ల కనీస అవగాహన కూడా లేదని దెప్పిపొడిచారు. భూ అవకతవకల విషయంలో సిట్ నుంచి తనకు లేఖ అందినా, అందకపోయినా సహకరిస్తానని చెప్పారు. తాను చేసిన ఆరోపణకు ఆధారాలను అందిస్తానని తెలిపారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.