bellamkonda: బోయపాటి ఆలోచన అదేనన్న మాట!

బోయపాటి సినిమా అనగానే పవర్ ఫుల్ డైలాగులు .. ఫటా ఫట్ కొట్టేసుకోవడాలు ఉంటాయి. అలాంటి బోయపాటి ఈ మధ్య వదిలిన 'జయ జానకి నాయక' సినిమా ఫస్టు లుక్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. బోయపాటి సహజ శైలికి భిన్నంగా పూర్తి లవ్ ఫీల్ తో ఆ ఫస్టులుక్ ఉండటమే అందుకు కారణం. ఆ తరువాత ఆయన తనదైన మార్కుతో యాక్షన్ స్టిల్ వదిలాడు లెండి.

ఇక ఈ రోజు కూడా ఆయన సాఫ్ట్ టీజర్ ను వదిలి అందరికీ మరోమారు షాక్ ఇచ్చాడు. ఓ కుటుంబం .. అక్కడ జరిగే వేడుక .. చూపులు కలవడాలు .. మనసులు అదుపు తప్పడాలు... వంటి దృశ్యాలతో టీజర్ ను కట్ చేశారు. లెక్క ప్రకారం తరువాత వచ్చే టీజర్ యాక్షన్ కి సంబంధించినదేనని చెప్పుకుంటున్నారు. మొత్తంగా ఇది యాక్షన్ తో కూడిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే విషయాన్ని చెప్పడానికి బోయపాటి తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు.  
bellamkonda
rakul

More Telugu News