sundeep kishan: 'నక్షత్రం' మధ్యలో ఆగిపోయిందా? అని అనొద్దంటోన్న సందీప్ కిషన్!

కృష్ణవంశీ దర్శకత్వంలో 'నక్షత్రం' సినిమా రూపొందింది. సందీప్ కిషన్ .. రెజీనా జంటగా నటించిన ఈ సినిమాలో, సాయిధరమ్ తేజ్ .. ప్రగ్యా జైస్వాల్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ సినిమా గురించి హీరో సందీప్ కిషన్ మీడియాతో ముచ్చటించాడు. 'ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి చాలా కాలమైందిగా .. మధ్యలో షూటింగ్ ఆగిపోయిందా?' అనే మాటే అనొద్దని సందీప్ కిషన్ అన్నాడు.

ఈ సినిమాను గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కించాలని కృష్ణవంశీ అనుకున్నారనీ .. అలాగే తీశారని చెప్పాడు. 8 భారీ పోరాట సన్నివేశాలను .. 5 పాటలను కృష్ణవంశీ తన అభిరుచికి తగిన విధంగా చిత్రీకరించారని చెప్పాడు. దాదాపు 120 రోజుల పాటు షూటింగ్ జరిగిందని అన్నాడు. ఎక్కడా రాజీ పడకుండా .. అనుకున్న అవుట్ ఫుట్ వచ్చేంతవరకూ కృష్ణవంశీ శ్రమించారని చెప్పాడు. అందువల్లనే షూటింగ్ కి ఎక్కువ సమయం పట్టిందే తప్ప .. షూటింగ్ ఆగిపోవడమంటూ ఎప్పుడూ జరగలేదని చెప్పుకొచ్చాడు.       
sundeep kishan
regina

More Telugu News