chiru: చిరంజీవితో రొమాన్స్ చేయనున్న సీనియర్ హీరోయిన్!

మెగా అభిమానుల దృష్టంతా కూడా ఇప్పుడు 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' ప్రాజెక్టు పైనే వుంది. ఈ సినిమాకి సంబంధించిన లుక్ విషయంలో చిరంజీవి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇక దర్శకుడిగా తనకి సంబంధించిన పనుల్లో సురేందర్ రెడ్డి బిజీగా వున్నాడు. ఈ సినిమాలో కథానాయికలుగా ఐశ్వర్య రాయ్ ను .. సోనాక్షి సిన్హాను తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

 తాజాగా నయనతార పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు ఉండనున్నారు. అందువల్లనే మరో కథానాయికగా నయనతారను ఎంపిక చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆమెను సంప్రదించడం .. గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. అసలు చిరూ 150వ సినిమాలోనే నయనతార చేయాల్సింది. కానీ అప్పటి కమిట్ మెంట్స్ వలన అది కుదరలేదు. ఆ తరువాత చిత్రంలోనే నయనతారకి చిరూ సరసన చేసే ఛాన్స్ తగలడం విశేషమే.     
chiru
nayanatara

More Telugu News