gopichand: అయోమయంలో పడిన గోపీచంద్ ఏం చేస్తాడో?

షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెరపై మంచి ఫాలోయింగ్ వున్న హీరోల్లో 'గోపీచంద్' ఒకరు. తన బాడీ లాంగ్వేజ్ కి నప్పే యాక్షన్ తో పాటు మిగతా అన్ని అంశాలు తన సినిమాలో ఉండేలా ఆయన చూసుకుంటాడు. అలాంటి గోపీచంద్ కి కొంతకాలంగా సరైన హిట్ లేదు. దాంతో ఆయన 'గౌతమ్ నంద' .. 'ఆక్సిజన్' సినిమాలపై ఆశలు పెట్టుకున్నాడు.

 సంపత్ నంది దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రంగా గోపీచంద్ 'గౌతమ్ నంద' చేశాడు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా చెప్పారు గానీ .. కొన్ని కారణాల వలన వెనక్కి వెళుతున్నట్టు తెలుస్తోంది. ఇక 'ఆక్సిజన్' సినిమాను ఆగస్టు 18న రిలీజ్ చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. కానీ ఆ సినిమా కూడా ఆ డేట్ కి వచ్చే అవకాశం కనిపించడం లేదట. దాంతో అయోమయానికి లోనైన గోపీచంద్ ఎలా స్పందిస్తాడోననేది ఆసక్తికరంగా మారింది. 
Go Back to Shorts
gopichand
hansika

More Telugu News